అంశం: చిత్ర కవిత
పేరు: డాక్టర్ గుమ్మా భవాని
శీర్షిక: ఆకాశంలో సగం
ఆడపిల్లని నేను
ఆకాశంలో సగం నేను.....
పుట్టింటి మహారాణిని
మెట్టినింటి పాలవెల్లిని నేను....
నేడు అంతరిక్షం వరకు
నా పయనం
ఆకాశం నా హద్దు.....
క్రీడలలో చెలరేగేను
ఇల్లాలిగ వంటింటి సామ్రాజ్యం నాదే....
కన్న బిడ్డలను
కడుపున మోసే తల్లిని.....
మాతృత్వం అపురూప వరం
అమ్మ అన్నమాటే పరవశం. ...
అన్నదమ్ములకు రక్షాబంధం కడతా
తోబుట్టువుగ నా ధర్మం నిర్వహిస్తా.....
అత్తమామలను ఆదరిస్తా
అమ్మానాన్నలకు తోడుగ నిలుస్తా....
చదువుల సరస్వతిని నేను
ఉద్యోగ పర్వంలో మహలక్ష్మిని....
పతికి తోడునీడనై ఆజన్మాంతం
కలిసి నడిచే ప్రేయసిని....
అందరి ఆకలి తీర్చే
అన్నపూర్ణని నేను. ...
రుద్రమనై ఝాన్సీలక్ష్మీబాయినై
వీర విహారం చేసేను....
విజ్ఞాన పథాన జ్ఞాన దీపికలు
వెలిగించిన క్యూరీని నేను....
విప్లవాలలో నేను వీర వనితనై నేను
త్యాగ ధనులలో నేను. ..
ముదితలు పలు రంగాలలో
రారాణులు వారే.....
No comments:
Post a Comment