Sunday, 30 March 2025

పరమార్ధమ్ ఆశించి

 

వాదించక తప్పదు
నా వాదనలో
బలముంటే
వాదించే
పట్టుదల
ధైర్యముంటే
నా వాదన
మండే సూర్యుడయితే
వాదన కోసం
వాదించొద్దు
ఒక పరమార్ధాన్ని ఆశించి
వాదిద్దాం


Tuesday, 18 March 2025

రాతి గుండె సుందరి

 

రాతి గుండె  సుందరి
ప్రేమ  ఎద లోతుల్లోనే

బాధ్యతల బరువు తప్ప
వలపు తలపులకే
చోటు లేదంటుంది

మంచు హృదయమైనా
కరగక తప్పదు


స్నేహం

 స్నేహం వయసు

జీవిత కాలం 


స్నేహం పరిమళం

జీవితకాలం

స్నేహం పరిచయం 

చెదరని చిరునవ్వు

Thursday, 6 March 2025

నేను _మనం

 నేనయితే  ఒంటరి

అదే మనం అయితే

 మహా బలం 


నేను విస్తరిస్తే

మనం 


మనమంటేనే

మహా వృక్షం


నేనో అనాధ

మనమో బహుకుటుంబం


మనం పచ్చగా

ఎదుగుతాం

శాఖోపశాఖలుగా 

విస్తరిస్తాం


మనం 

మైత్రీబలం

మనం

జగన్మోహనం

Monday, 3 March 2025

ఆకాశంలో సగం

 అంశం: చిత్ర కవిత 

పేరు: డాక్టర్ గుమ్మా భవాని 




శీర్షిక: ఆకాశంలో సగం 


ఆడపిల్లని నేను 

ఆకాశంలో సగం నేను.....


పుట్టింటి మహారాణిని

మెట్టినింటి పాలవెల్లిని నేను....


నేడు  అంతరిక్షం వరకు 

నా పయనం

ఆకాశం నా హద్దు.....


క్రీడలలో చెలరేగేను

ఇల్లాలిగ  వంటింటి సామ్రాజ్యం నాదే....

కన్న బిడ్డలను

కడుపున మోసే తల్లిని.....

మాతృత్వం అపురూప వరం

అమ్మ అన్నమాటే పరవశం. ...


అన్నదమ్ములకు రక్షాబంధం కడతా

తోబుట్టువుగ నా ధర్మం నిర్వహిస్తా.....

అత్తమామలను ఆదరిస్తా

అమ్మానాన్నలకు తోడుగ నిలుస్తా....

చదువుల సరస్వతిని నేను

ఉద్యోగ పర్వంలో మహలక్ష్మిని....

పతికి తోడునీడనై ఆజన్మాంతం 

కలిసి నడిచే ప్రేయసిని....


అందరి ఆకలి తీర్చే 

అన్నపూర్ణని నేను. ...


రుద్రమనై ఝాన్సీలక్ష్మీబాయినై

వీర విహారం చేసేను....


విజ్ఞాన పథాన జ్ఞాన దీపికలు

వెలిగించిన క్యూరీని నేను....


విప్లవాలలో నేను వీర వనితనై నేను

త్యాగ ధనులలో నేను. ..


ముదితలు పలు రంగాలలో 

రారాణులు  వారే.....