Tuesday, 10 December 2024

ప్రజల హృదయాల్లో అపరాజిత

 



పేరు: డాక్టర్  గుమ్మా భవాని 

శీర్షిక: ప్రజల  హృదయాల్లో అపరాజిత


చరిత్ర పుటల్లో 

ఆమె  పరాజిత

కానీ ఆమె ధైర్యసాహసాలు 

మహిళలందరికీ గర్వకారణం 


ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో 

పరాజిత  తానైనా

వీరనారిగా ప్రజల హృదయాల్లో 

చెక్కుచెదరని  స్థానం

ఝాన్సీ లక్ష్మీబాయిది 


ఎందరో వనితలు

తల్లులు 

జీవన పోరాటంలో 

పరాజితులు 


కానీ వారి 

స్వప్నం 

ఆశయం ఫలిస్తుంది 

వారి త్యాగాల పునాదుల మీద 

పెరిగిన

వారి బిడ్డల 

బంగరు భవితలో


అలుపెరుగని పోరాటం చేసే 

ప్రతి నారీ 

ప్రజల హృదయాల్లో 

అపరాజిత

No comments:

Post a Comment