Sunday, 22 September 2013

swaram

ఆంధ్రా సౌభాగ్యమ్  మాది కూడా
గర్జించిందా స్వరం
అక్కడ స్వేచ్చా స్వాతంత్త్ర్యం  మావి కూడా
లక్షగళాలు ఒక్కటిగా
పలికిందా స్వరం

రాజకీయేతర శక్తి సత్తా
చాటిందాస్వరం
 అది ప్రజాబలమే తన శక్తిగా
 బలోపేతమైన స్వరం

అది కోట్లాది ఆంధ్రుల హృదయ స్పందనగా
తననితాను ఆవిష్కరించుకున్న స్వరం
రక్త బంధం లేకున్నా ఆదరాభిమానాలను
అందుకున్న ఆత్మ బంధువైన స్వరం

22.9.2013    

No comments:

Post a Comment