Sunday, 22 September 2013

shoka rahitandhra

అశోక సుందరి
శివపార్వతుల సంతతట
నాకు తెలియని శివ పురాణం

అశోకుడు మొక్కలు నాటించాడు
రోడ్డుకిరుపక్కలాచెట్లు చూస్తే తలపుకొస్తాడు
ఆ అహింసా సామ్రాట్

అశోకుడు నేడు  సీమాంధ్ర తులసికోట
ఆశాదీపం
శోక రహితంధ్ర కావాలి
నాయకుల సమైక్య ధ్యేయం

22 .9.2013

swaram

ఆంధ్రా సౌభాగ్యమ్  మాది కూడా
గర్జించిందా స్వరం
అక్కడ స్వేచ్చా స్వాతంత్త్ర్యం  మావి కూడా
లక్షగళాలు ఒక్కటిగా
పలికిందా స్వరం

రాజకీయేతర శక్తి సత్తా
చాటిందాస్వరం
 అది ప్రజాబలమే తన శక్తిగా
 బలోపేతమైన స్వరం

అది కోట్లాది ఆంధ్రుల హృదయ స్పందనగా
తననితాను ఆవిష్కరించుకున్న స్వరం
రక్త బంధం లేకున్నా ఆదరాభిమానాలను
అందుకున్న ఆత్మ బంధువైన స్వరం

22.9.2013    

Friday, 20 September 2013

samaikyandhram

ఉప్పొంగిన కెరటానికి
సాక్షీభూతం మేము
అది సమైక్యాంద్రం

హోరువానలో చప్పట్ల హోరు
అది విజయవాడ  సమైక్యాంద్రం

సీరియల్స్ టి పి ఆర్ పి రేటింగ్స్ పడిపోయి
లక్షలాది నయనాలు వార్తా చానళ్ళకి
అంకితమయిపోతే
అది సమైక్యాంధ్రమ్

శోక సంద్రమైన  సీమాంధ్రకి
అశోకన్న సైన్యం
అండదండ తానయితే
అది సమైక్యాంధ్రమ్

అన్యాయం జరిగిందని
విభజించాలంటే
దక్షిణాది ఉత్తరాది భరత దేశాలుగ
విభజించాలని
గర్జించిన యువకిశోరం
అది సమైక్యాంధ్రమ్

 BHAVANIRAM
21.9.13