ఏ విత్తులు చల్లేమని ఈ నందన వనం లో
విజయ వత్సరం విజయకేతనం
ఎగురవేయడానికి
ఒక తరం యువతరం
వలసపోతోంది పశ్చిమానికి
ఈ వలస తరం తూర్పు సూర్యోదయం
చూసేదెప్పుడో
సింధు నాగరికత మనది
అర్యద్రవిడ సమ్మేళన
సుసంపన్న నాగరికత మనది
సంపన్న దేశాలకి వలస పోతున్న యువతరం
అనుసరించేదే నాగరికత
విజయవత్సరమా
నీ కానుక ఏ నాగరికత
చట్ట సభల్లో
మహిళా రిజర్వేషన్
మహిళా సాధికారత
ఏం సాధించిందని నందనం
విజయవత్సరమా
మహిళా విజయకేతనం
నువ్వేగరేసేదెప్పుడు
కరెంటు కోతలు వాతలు
రైతన్నా కొలిక్కి వచ్చేదెప్పుడు
నీ కష్టం
విజయ వత్సరమా
రైతన్న విజయోత్సాహాల
వసంతం మరెప్పుడు
ఆశ మనిషి ఊపిరి
మార్పు జీవన తత్వం
నందన అపజయాలూ వైఫల్యాలే
తొలిమెట్టు విజయానికి
విజయ వత్సరానికి
భవానిరామ్
10.4.2013
విజయ వత్సరం విజయకేతనం
ఎగురవేయడానికి
ఒక తరం యువతరం
వలసపోతోంది పశ్చిమానికి
ఈ వలస తరం తూర్పు సూర్యోదయం
చూసేదెప్పుడో
సింధు నాగరికత మనది
అర్యద్రవిడ సమ్మేళన
సుసంపన్న నాగరికత మనది
సంపన్న దేశాలకి వలస పోతున్న యువతరం
అనుసరించేదే నాగరికత
విజయవత్సరమా
నీ కానుక ఏ నాగరికత
చట్ట సభల్లో
మహిళా రిజర్వేషన్
మహిళా సాధికారత
ఏం సాధించిందని నందనం
విజయవత్సరమా
మహిళా విజయకేతనం
నువ్వేగరేసేదెప్పుడు
కరెంటు కోతలు వాతలు
రైతన్నా కొలిక్కి వచ్చేదెప్పుడు
నీ కష్టం
విజయ వత్సరమా
రైతన్న విజయోత్సాహాల
వసంతం మరెప్పుడు
ఆశ మనిషి ఊపిరి
మార్పు జీవన తత్వం
నందన అపజయాలూ వైఫల్యాలే
తొలిమెట్టు విజయానికి
విజయ వత్సరానికి
భవానిరామ్
10.4.2013