Sunday, 4 November 2012

varsham varsham

గంటయి  కుండపోత వృష్టి  దుఃఖం
కట్టలు తెంచుకున్నట్టు
ఆవేశంతో  విరుచుకు పడ్డట్టు

నేలతల్లిని నీటితో
కన్నీటితో ముంచెత్తుతోంది
అంత గంభీరమైన  ఆకాశం
బేలగా విలవిలలాడుతోంది 

ఉరుముతోంది
గర్జిస్తోంది
గూట్లో వెచ్చగా నేనున్నా
ఆ వర్షంలో తడిసి ముద్దవుతున్న అనుభూతి
వర్షం వర్షం శబ్దిస్తోన్న వర్షం

రెండు గంటలయి
నన్ను లేపి కూర్చోపెట్టింది
నా సంగీతాన్ని
నువ్వు వినితీరాలని 

భవాని
4.11.2012-2.30a.m. 

lovely message

lovely message:

shahjahan`s taj for mumtaj
is only a glory
devadas`s love for paru is a story
my love for you
is a living eternity
3.11.2012

ఏ క్షణంలోనైనా
ఎగిసిపడే అలలతో
సంద్రం అలిసిపోవచ్చు

ఏ క్షణంలోనైనా
సూర్యుడి చుట్టూ పరిభ్రమించే భూమి
భ్రమణాన్ని మరిచిపోవచ్చు

నిరంతరం నిన్ను
ప్రేమించే నా హృదయం
అలిసిపోదు మరిచిపోదు

RAM-the best half
3.11.2012


gnapakaala tadi

మీ కవితల సంపుటిలో
భీమవరం ప్రస్తావన లేదేమని
అడిగాడు డిప్యూటీ తాశీల్దారు

నాలుగిళ్లలోగిలి
చెరుకు చేనై  ఆ అపురూప దృశ్యం
మటుమాయమయిందని
నేను వలవలా ఏడిస్తే
ఆ విషాద దృశ్యానికి
సాక్షీభూతం తాను

బొబ్బిలి దగ్గర కుగ్రామం భీమవరం
మా నలుగురితాతల స్వగ్రామం మా భీమవరం
ఆ నాలుగిళ్ళ లోగిలిలో
తాతలు  బామ్మలు
అన్నలు చిన్నాన్నలు
అక్కలు అత్తలు

బాల్యంలో వేసవి సెలవుల్లో
ఆ నాలుగిళ్ళ లోగిలిలో
మేమాడిన ఆటలు
తాతగారి కాశీ ప్రయాణ ముచ్చటలు

వూళ్ళో పెట్టగానే
బుచ్చి బుగత పిల్లలా
గ్రామస్తుల పలకరింపుల ఆప్యాయతలు

ఆ పంటచేల గట్లమీద నడవడం సరదా
ప్రతి వేసవికీ  మంచి వేసవి విడిది  అది
ప్రతి వేసవి సెలవులూ గొప్ప అనుభూతి
అనిర్వచనీయ  ఆనందం
అంతా మన వాళ్ళన్న రక్త బంధం

ఎన్నో ఏళ్ళ తర్వాత
ఆపక్కగా ఎం ఫిల్ ఫీల్డ్ వర్క్ కి వెళ్తూ
మావూరు మావూరంటూ సంబర పడుతూ
కార్లోంచి తొంగి తొంగి చూస్తే ఏముంది

పొలంగా మారిన నాలుగిళ్ళ లోగిలి
తాతగారి నుయ్యని మేం చెప్పుకునే బావి
చేనుకి నీరందిస్తూ
మిగిలిన చిట్ట చివరి అనుబంధం

పిన్నలనీ పెద్దలనీ
ఎంతగానో అలరించి
బంధుత్వాలు ఆప్యాయతలు
పెనవేసిన నాలుగిళ్ళ లోగిలి
తలుచుకుంటే చెమ్మగిల్లుతాయి
ఇప్పటికీ నాకళ్ళు

కవిత రాయడానికి
ప్రేరణ నిచ్చిన శంకర్ కి
కృతజ్ఞతలతో
భవాని
11.10.2007