Sunday, 24 June 2012

padunu

అత్తగారు పదును
ఆవకాయ పదును

కత్తిపీట పదును
ఎత్తిపొడుపు  పదును

ప్రేమ పదును
పెళ్లి పదును

స్నేహం పదును
ద్వేషం పదును

వృత్తి పదును
ఊపిరి పదును

పదును పెడదాం
మన ఆలోచనలకి
అక్షరాలకి
ఆయుధానికి

25.6.2012

Friday, 22 June 2012

asrutarpanam

అనుకున్నా నందన నామ వత్సరం
ఉక్కునగరాన్ని నందనవనంగా మారుస్తుందని
ఆనందం డెందాన సుర గంగై
 పరవళ్ళు తొక్కుతుందని

మాకేం తెలుసు అది చావు దెబ్బ తీస్తుందని
మృతుల సంఖ్య పంతొనిమిదని చావుకబురు
చల్లగా చెబుతుందని
ప్రాణవాయువే ప్రాణాలు హరించింది
ఒత్తిడి పెంచేరని ఆగ్రహించి

చిన్న పొరపాటుకి అంతదండనా
సగర్వంగా సమున్నతంగా నిలిచే విశాఖ ఉక్కు
ఖిన్నమై దీనమై చిద్రమై
కన్నీర మున్నేరయింది

తండ్రి దూరమయిన చిన్నారిని
కొడుకు దూరమయిన తండ్రిని తల్లిని
మరిచేదెలా

సగర్వంగా తల ఎత్తే వేళ
అగ్నికీలలకాహుతయ్యారు
సమిధలయ్యారు తాముసహితం
పారిశ్రామిక యజ్ఞంలో
శ్రమయజ్ఞంలో

మరువము మీ త్యాగాలను
ఎన్నటికీ
అశ్రుతర్పణం ఇదే
మీ ఆత్మ శాంతికి

భవానీరామ్
23..6.2012

Monday, 18 June 2012

rajatotsava sambaram

నువ్వు ప్రేమతో పెంచుకునే మొక్కలంత
పచ్చదనం  మీ సంసారం
నీ గలగల నవ్వుల గోదారంత
తీయదనం  మీ సంసారం

ముద్దుల మేనకోడలిని
ముద్దాడక ముందు కలిసి
మేనకోడలితో ఎదిగి
రజతోత్సవ సంబరాల సంసారం
నిరంతరం  సాగనీ కొనసాగనీ
వసంతమై సుమధుర యుగళ గీతమై
నిత్య నూతనంగా

నిఖిల ప్రపంచమే మీ ప్రపంచం
మీ వాత్సల్యమే తానై
వత్స తానయ్యాడు శ్రీవత్స

వైవాహిక జీవిత రజతోత్సవ సంబరాలు
ఎద ఉప్పొంగి అంబరమంట
అందుకోండి మా అందరి శుభాకాంక్షలు
పెద్దల శుభాశీస్సులు

*అన్నా వదినలకు ప్రేమతో
2.6.2012