Wednesday, 28 March 2012

premato

చిట్టి నేస్తం
మీకోసం చిన్ని కవిత రాయనా

గానకోకిల మీరు
స్వచ్చమైనది మీ హృదయం
పాపాయి మనసు మీది
తెలుసు నాకు మీ హృదయ సౌంధర్యం

మీ మాతృత్వం అందుకుంది
సోనూ దీపూలను వరాలుగా
ఆ వెన్నెలమ్మ మీరు
ఆప్యాయతల జల్లు మీరు
సుస్వరాల కోయిలమ్మ మీరు
 మాటల జలపాతం మీరు

మన స్నేహంలో పదాలు నేర్చుకున్నా
స్వరాలూ నేర్చుకున్నా
బాల్యమంటే మీరు
మీరంటే నా బాల్యం
స్నేహమంటే మీరు
నేస్తమంటే మీరు

మీ స్నేహం ఆకాశగంగ
ఎదలో తొలకరి ఎల్లప్పుడూ
ప్రేమతో
మీనేస్తం

15.5.2010  

Sunday, 18 March 2012

sambaraalu ambaramamte

మూడు తరాలు ముప్పేటగా
కలిసాయి సంగమంగా
శుభకార్య సాక్షీభూతంగా

అత్తలు మామలు
అయ్యలు అమ్మలు

అమ్మమ్మ నానమ్మ తాతలు
అన్నాచెల్లెలు వదిన బావలు
స్నేహితులు సన్నిహితులు

తరలివచ్చేరు అత్తమామలు
తనయునితో బంధుమిత్రులతో
సంబరాలు అంబరమంటే
శుభాకాంక్షలు శుభాక్షితలయ్యే

అవధులులేవు
అమ్మాయి ఆనందానికి
కావాలి అదే తన బంగరు భవితకి
రాచబాట

18.3.2012
  

samsiddhamavudaam

అనుకోకుండా మీద పడతాయి
ప్రమాదాలు ఆకస్మిక మరణాలు

మనం మానసికంగా సంసిద్ధంగా లేకున్నా
స్వీకరించాలి తప్పనిసరిగా

శుభ కార్యాలకై
బంధుమిత్రుల సమాగమానికై
ఎదురు చూస్తాం ఎన్నాళ్ళో
సందళ్ళ  నడుమ
వినిపించీ వినిపించని కనిపించీ కనిపించని
సన్నని అపశ్రుతులు

అనుకోకుండా ఆకస్మాత్తుగానే
పైన పడతాయి యివికూడా
స్వీకరించక తప్పదు హృదయ పూర్వకంగా

సంసిద్ధమవుదాం దేనికైనా
అపశ్రుతులకైనా

18.3.2012