శనివారం
సాయంత్రం నాలుగుకి
మొదలైన నిద్ర
సోమవారం పొద్దున్న ఆరుకి ముగిస్తే
ముప్ఫైఎనిమిది గంటల సెలవు నిద్ర
ఎంతానందం
మరీ అత్యాశ
శనివారం రాత్రి తొమ్మిది
సోమవారం పొద్దున్న ఆరు
ముప్పై మూడు గంటల నిద్ర
కోరిక బాగుంది
శనివారం రాత్రి తొమ్మిది
ఆదివారం పగలు పది
పదమూడు గంటల నిద్ర
ఈ కల కూడా అందంగా వుంది
శనివారం రాత్రి తొమ్మిది
ఆదివారం పగలు ఎనిమిది
ఒకటి తక్కువ పన్నెండు
ఇదీ బాగానే వుంది పదకొండు
శనివారం రాత్రి తొమ్మిది
ఆదివారం పగలు ఆరు
తొమ్మిది గంటల నిద్ర
నాకు ఓకే అమ్మకి ఓకే
శనివారం రాత్రి పదకొండు
ఆదివారం పగలు ఆరు
ఏడుగంటలు ఇదయినా చాలు
శుక్రవారం రాత్రి పదకొండు
పన్నెండు దాటి రెండు
not at all o.k.
అయినా తప్పదు
దుర్ముహుర్తంలోతెలివి వచ్చేస్తే
దుర్ముహుర్తంలోతెలివి వచ్చేస్తే
రాహుకాలంలో మేలుకుంటే
మెదడు పదునెక్కితే
కలం చకచకసాగితే
సుముహర్తమే
అమృత ఘడియలే అవి
21.1.2012