Saturday, 22 February 2025

అమ్మ ఒడి

 

ఊరి చివరి బంగ్లా
బంగ్లాలో రాకుమారి
తోటలో  తిరుగుతూ
వెన్నెల్లో  విహరిస్తూ

నాన్న పట్నంలో
పారిశ్రామికవేత్త
నానమ్మ తాత తో
రాకుమారి బంగ్లాలో

ఊరి సంగతులు తెలుసుకుంటుంది
ఆపదలో  సాయం చేస్తుంది
వరదలు ఊరిని ముంచెత్తితే
బంగ్లా వే అందరికీ
అమ్మ  ఒడి తానయ్యింది


Monday, 17 February 2025

జర భద్రం

 

అదేమి చిత్రమో
బంగారు రంధ్రాలట

కిందనున్న  పసిమిరంగు
రంధ్రం పై ప్రసరిస్తే
పసిడిని చేరాలన్న
ఆరాటంలో
రంధ్రాన్ని పెద్దది చేసి
పసిడిని చేరాలని
తొందర  పడతాడు
పాపం మానవుడు

బంగారు పుట్ట
బంగరు రంధ్రంలో
వేలుపెడితే
పాముకాటు  ఖాయం
జర భద్రం


Saturday, 15 February 2025

అద్భుత రసం

 ప్రయాణాలు

గొప్ప అనుభవాలు

ఎవరెవరో

తారసపడతారు 

ఎన్నో 

పర్యాటక స్థలాలు 

చూస్తాం 

చేదు అనుభవాలు

కూడా 

ఎదురౌతాయి

విమాన

ప్రయాణం 

మబ్బుల దారిలో

విదేశాలకు సైతం 


వింత అనుభవాలు 

కొన్ని  మహా కావ్యాలు

అనుభవమే 

అద్భుత రసం

Wednesday, 12 February 2025

నా హృదయ స్పందన నీవే

 


పేరు: డాక్టర్ గుమ్మా భవాని 


శీర్షిక: నా హృదయ స్పందన నీవే 


నా వేకువలో  నీవు

నా వెన్నెలవై నీవు


నీ పాదాల పారాణినై నేను

మన పొదరింటి మహరాణివే నీవు   


నా మోహనరాగానివే నీవు

సాకారమైన సుందర

స్వప్నానివే నీవు  


మన ముంగిట 

తీరైన రంగవల్లివే నీవు  

మమతానురాగాల పాలవెల్లివి 


నా జీవిత నిత్య వసంతానివి

నా జీవిత మాధుర్యమే నీవు


తోడు నీడవైన సఖివే నీవు 

ప్రేమని పంచే పెన్నిధివి 

నా హృదయ స్పందన  నీవే



Friday, 7 February 2025

గతకాలపు తీపిగుర్తులు

  

వాడినపూలు
వాటి యవ్వనాన్ని
జీవితాన్ని
పరిమళాన్ని
సోయగాల్ని
అన్నీ
గుర్తుచేస్తుంటాయి


Tuesday, 4 February 2025

పండుగ

 అసురుడు మరణిస్తే 

అవనికి పండుగ

కీచకుడి ప్రాణం 

గాల్లో కలిస్తే

అతివకి పండుగ

తల్లి తండ్రి

 భూదేవి తల్లి 

భూమికి వెలుగిచ్చే

సూర్యనారాయణుడు

తండ్రి

చైతన్యం

 పుడమికి చైతన్యం 

అతిప్రియం

సగభాగం సూర్యకాంతిలో 

చైతన్యవంతంగా

ఎల్లప్పుడూ

Saturday, 1 February 2025

మనసు వెన్నపూస

 

మంచు పర్వతాల్లో
మసిలేటి నావోడు
మనసు వెన్నపూస
మది నిండా నేనే