Friday, 2 October 2015

shashthipurthi mahotsava subhakankshalu

మంచితనం మూర్తీభవించిన అన్నయ్యగారు
చలాకీతనం అనునిత్యం చివురించే వదినగారు
సంతోషం సంతృప్తి సంబరాల సమ్మేళనం
త్రివేణీ సంగమం షష్టి పూర్తి మహోత్సవం

సీతారాముల కళ్యాణమే ఇందిరా శివరామకృష్ణల
 కళ్యాణ మహోత్సవం
పాత్రుని సూర్యనారాయణమూర్తి జానకమ్మల
జ్యేష్ట పుత్రునికి కోడలికి
అమ్మ దీవెనలు ఎల్లప్పుడూ

మనవరాలు లాస్యకది అమ్మమ్మా తాతల
కనివిని ఎరుగని కల్యాణం కమనీయం
వింతైన వినోధం
మీనాసంతోష్ సింధూ శ్రీకాంతల
సాకారమైన సుందర స్వప్నం

అన్నావదినలు అక్కాబావలు
మరుదులు తోటికోడళ్ళు బంధుమిత్రులు
అందరికది చూడముచ్చటైన వైభవం
కన్నుల పండుగ
అరవై పాతికగా మారిన
అద్భుతగడియలు
అందరికది వేడుక
అరుదైన ఆవకాశం
 అపురూపమైన మధురానుభూతి

సుమధురక్షణాలు
సుసంపన్నమైన వేళ
అందుకోండి మీయిద్దరూ
మా అందరి శుభాకాంక్షలు
పెద్దల శుభాశీస్సులు
ముక్కోటి దేవతల దీవెనలు

షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు
అభినందనలు
అభివందనములతో
భవానీరామ్
27.9.2015