Thursday, 5 July 2012

chittitalliki shubhaakaamkshalato

కన్నీటి బిందువు
కవితౌతుంది అప్పుడప్పుడూ
 అల్లుడు కోసం కూడా రాసేస్తావు
 నాకోసం రాయాలనిపించదేం
కూతురి సాధింపు

గణితంలో తొంభై దాటి తెచ్చుకున్నా
విజ్ఞాన శాస్త్రా లానే నమ్ము కున్నావు

ఇంజినీరింగ్ ఉద్యోగావకాశాలు
పుష్కలంగా ఇస్తుందని తెలిసినా
సైన్సు బాట తొక్కావు

వచ్చిన ర్యాంక్ తో రాజీపడక
జైలు జీవితానికి సంసిద్ధమయి మరీ
విజయవాడ కదిలావు విజయం
కైవసం చేసుకోవడానికి

డాక్టర్ వనిపించుకున్నావు
పట్టుదలగా
కానీ అమ్మానాన్నా చిట్టి చెల్లెలికి
దూరంగా ఎంత ఆక్రోశించావో
ఆరోగ్యాన్ని ఎంతగా పణం పెట్టావో
జాలువారే నా కన్నీటికి తెలుసు

చిట్టితల్లీ ఈనాటి నీకష్టం
నీ భవితకి బంగరు బాట వేస్తుంది

దేశం విడిచి వెళ్ళడానికి సైతం
సంసిద్ధమవడం
 మాకే అర్ధమయ్యే నీత్యాగం

ఇక్కడ నీ నడకకి మీ డాడీ
చిటికిన వేలు కొండంత అండ
ఆదేశంలోసాయం చేసుకోవాలి నీకు నువ్వే
అయినా నమ్మకం విశ్వాసం
నువ్వు మెట్టినింటికి పుట్టినింటికి
వన్నె తెస్తావని

నాయనమ్మ శిక్షణ
ఆ వృద్ధ దంపతులకి
నువ్వందించేసంరక్షణ
ఈవయసులో మీ తరానికి
సాధ్యం కావు ఎవరికీ
అభినందనలు
శుభాకాంక్షలు నీకు
మా అందరివీ

అమ్మ
4.7.2012      
  

Sunday, 1 July 2012

somayaajula

యజ్ఞం చేసినవాడు సోమయాజి
సోమయాజుల వెంకట శంకర సిద్ధార్థ
హరిహరులను నీలో నిలుపుకొని
యజ్ఞం మొదలెట్టేవు
అమ్మా నాన్నలు నీకు పేరు పెట్టగానే

యజ్ఞం కొనసాగించేవు
ఇంజనీరింగ్ విద్యార్థిగా
అమ్మకి దూరంగా

పశ్చిమాన వెలుగుతున్న తూరుపు సూరీడుగా
యజ్ఞం కొనసాగిస్తున్నావు సృజనాత్మకంగా
సృజనాత్మవై
జగతి గర్వించే వైద్యురాలిని సృజియింప

యజ్ఞం కొనసాగిస్తావు
అమ్మా నాన్నల తరగని ప్రేమతో
చిరాయువువై

యజ్ఞం కొనసాగించు
అమ్మకడుపు చల్లగా
అత్తా కడుపు చల్లగా
చేపట్టిన సిరి సిరులు కురుప శ్రీహరివై
సిద్దార్థ వై
విష్ణు సహస్ర నామ వైభవం
నీ పేరులో వెలుగొంద

యజ్ఞం కొనసాగించు
సోమయాజుల వెంకట శంకర సిద్ధార్థా

నీ జీవితం యజ్ఞమంత ఉన్నతముఉజ్జ్వలము
అతి పవిత్ర కార్యమై వెలుగొంద

శుభా కాంక్షలతో
 భవానీ సుబ్రహ్మణ్యం
8.5.2012