Thursday, 3 May 2012

nela baaludu

అమ్మా నాన్న ని అడిగి మరీ 
ముచ్చట పడి బుద్దుడిని 
మా ఇంటికి తెచ్చు కున్నప్పుడు 
తెలియనేలేదు 
సిద్దార్ధుడే మా ఇంటి తలుపు తడతాడని 
డాక్టరమ్మ జీవితంలోకి వస్తాడని 

ఏ నోము ఫలమో  ఏ పూజ వరమో
సీతమ్మ నట్టింట పారాడే చిన్ని కృష్ణుడు 
అయినాడు తాను 
రామయ్య చిటికిన వేలు పట్టి నడిచాడు తాను 

మా అందరి శుభాశీస్సులు 
పుట్టినరోజు శుభాకాంక్షలు 
ఈ నెలబాలునికి  మన సిద్దార్దకి 

3.5.2012 

keep it up

అలసట మోములో
కనపడనీక పోవడం 
చిరునవ్వు చెధరనీక పోవడం 
అందరికీ అది అబ్బురం 

అలసిపోతూనే  recharge అవడం 
ఆశ్చర్యార్ధకం నాకు 
ఆజన్మాంతం కొనసాగనీ 
అదే ప్రవృత్తి 

 3.5.2012

vesavi

వేసవి కాలం 
సెలవులు మల్లెలు 
ఇష్టమైనవే రెండూ
 
computer ముందు కూర్చుంటే 
విశ్రాంతి నోటికీ కాళ్ళకి 
కానీ అలసట కంటికి 
నొప్పులు చేతికి 
ఎడమ చేయి సపర్యలు చేయాలి కుడి చేతికి 

స్వేచ్చ మనసును తాకి 
హాయినిస్తుంది  మలయమారుతంలా
మటు మాయమౌతుంది 
నీటిబుడగలా  

4.5.2012