Monday, 27 February 2012

aluperugani prayaanam

మూడో దశకంలో
అలుపెరుగని ప్రయాణం

నిత్య నూతనమై
నూతనోత్తేజమై
ఓ సుమధుర యుగళమై
చలువ పందిరి నీడన
అలుపెరుగని ప్రయాణం
నీతో నా ప్రయాణం

వెన్నెలే గాని
తెలియవు గ్రీష్మ తాపాలు
తెలియవు దైన్యం నైరాశ్యం

వైవాహిక జీవన సౌందర్యం
అందాల కానుక
అద్భుతవరం

ప్రయాణం యిద్దరుగా మొదలై
నలుగురిగా కొనసాగితే
అది అమృత ఫలం

28.2.2012

Friday, 17 February 2012

twinkle twinkle

ట్వింకిల్  ట్వింకిల్ లిటిల్ స్టార్స్
పెరిగి పెద్దయ్యాక కూడా తారలే  మీరు 
తల్లి తండ్రులకు
 ఉపాధ్యాయులకు


ఉపాధ్యాయుల యెదలో
వేల వేల తారలు
తళుకులీనే తారలు
తమ విద్యార్ధినీ విద్యార్ధులు
ఎక్కడున్నా ఎప్పటికయినా

17.2.2012



  

Tuesday, 7 February 2012

jeevita edarilo

జీవిత ఎడారిలో 
ఒంటరి బాటసారులం

కలుసుకుంటాం 
మిత్రులమై 
హితులమై సన్నిహితులమై 

రక్త సంబంధమై
తీయని అనుబంధమై 

రాలిపోతాం తోకచుక్కలమై 
నిశ్శబ్దమై 
మిగిలిపోతాం తారలమై ద్రువతారలమై
పదిలమై
మనవారి ఎదలలో

8.2.2.12