Thursday, 11 December 2025

గులాబీ వెన్నంటే ముల్లు

 

ఆమె మనసు
గులాబీ
గులాబీ అంత
మార్దవం
తాజాతనం
మంచు ముత్యాలను
నిలుపుకునే సోయగం

గులాబీకి
ముళ్ళున్నట్టే
తన మనసుని
ఎవరు పడితే వారు
దోచుకోవడానికి
తావీయదు

తన ఇష్టం మేరకే
సున్నితంగా
తన మనసుని గెలుచుకున్నవానికే
ఆమె మనసు  గులాబీ
సొంతమవుతుంది

10.12.25

కన్నీటి తడి

 కళ్ళు ఎడారులుగ

మారిన వేళ


వలచిన వారు

మోసం చేస్తే 

కనులు ఎడారులే


ఎడారిలో

పొడి ఇసుకలా

కళ్ళలో నీరు ఇంకి

పొడి పొడిగా

మారిన వేళ 


ఎడారి అంతా

నిర్మానుష్యం

ఆ కంటి చూపు కూడా 

శూన్యంలోకేభ‌

చుట్టూ ఉన్న జనంతో

సంబంధం  లేనట్టు


ఎడారికి

వర్షమెంత అవసరమో

పొడిబారిన

ఆ కనులు

తడి కావడం

అంతే అవసరం


9.12.25

హిమనదమైన గ్రీష్మ తాపం

 గడ్డ కట్టిన

వేడి


ఆమెది

గ్రీష్మ తాపం


ఆ తాపానికి

తుషారమై

ఒక ప్రేమ

దగ్గరగా ఉన్నా

ఏదో దూరం


వేడి కాస్తా

ఘనీభవించి 

గడ్డకట్ట సాగింది


సాగరుని 

చేరేవరకూ

ఆమె హిమనదమే


8.12.25

మానసిక స్థైర్యమే మందు

 మాయని గాయం 

రేగుతుంది  పదేపదే


ఆ వ్యక్తులు తారసపడ్డా

అవే సంఘటనలు ఎదురైనా


ప్రేమలో మోసపోతే

పదేపదే అవమానాలు

ఎదురైతే

పదేపదే దోపిడీకి 

గురి అయితే


కులం పేరుతో

మతం పేరుతో

వివక్షతకి గురి అయితే 


దివ్యాంగులు

మూడో  జెండర్

అవమానాలకు గురి అయితే


గృహహింసకి

బలయ్యే స్త్రీలు 

అన్నీ రేగే గాయాలే

ఎంతో మానసిక  స్థైర్యం

సమాజం రక్షణ  కావాలి

ఈ గాయాలు సమసి పోవాలంటే 


7.12.25

అలసిన వెలుగులు

 అమ్మానాన్న 

వృద్ధాప్యంలో 

అలసిన వెలుగులు


యుక్తవయసులో వారు

పిల్లలకు తల్లితండ్రులై

వెలుగులు చిమ్ముతూ

తమ బిడ్డల అభివృద్ధి కోసం 

అణువణువూ ధారపోసి 


వృద్ధాప్యం వచ్చేసరికి 

శక్తిహీనులై

అలసిన వెలుగులవుతారు


కానీ వారి మోములో

ఆనందం

సంతృప్తి 

పిల్లలు ఇచ్చే భద్రత 

ప్రేమతో

కానవస్తాయి 


అలసిన వెలుగులను

వెలిగిద్దాం

అస్తమించే సూర్యుడు కూడా 

తన అందంతో

అందరినీ ఆనంద

పరవశులను చేస్తాడు


6.12.25

నల్లగాలి చేదు జ్ఞాపకం

 ఒకప్పటి 

బొగ్గు ఇంజన్

నల్లగాలి జ్ఞాపకం 


కర్మాగారాలలో 

ఏళ్ళ తరబడి శ్రమించిన

శ్రామికులకు

కర్మాగారాల

నల్లగాలి

చేదు జ్ఞాపకం 


గ్రామం నుండి 

నగరానికి  వచ్చి 

తిరిగి  తమ గ్రామం వెళ్ళేక

నగర వాహనాల

నల్లగాలి

చేదు జ్ఞాపకం 


వేపచెట్టు గాలి

కొండగాలి

మలయమారుతం 

ఉద్యానవనంలో గాలి

ఉల్లాసభరితం


నల్లగాలి జ్ఞాపకం

 మానవాళికే

చేదు జ్ఞాపకంగా


5.12.25

నిశ్శబ్ద తుపాకీ

 శబ్దం రాని తుపాకీ

సూటిపోటి  మాటలు 

అనుమానం  పిశాచీ


తనకి అణిగే ఉండాలన్న 

పురుషాహంకారం

మహిళలు తమ కామాన్ని

తీర్చే వారిగానే చూసే

కీచకులు


నిశ్శబ్ద తుపాకీ

భార్య  తనకన్నా 

ఉన్నత స్థానంలో 

ఉండకూడదన్న అహం


మహిళలు  రాజకీయ 

నేతలుగా ఎదగకూడదనే

గూడుపుఠాణీలు



పసిపాపలు

వృద్ధ మహిళలపై సైతం 

అత్యాచారాలు 

సమాజంలో పేలే

నిశ్శబ్ద  తుపాకీలు ఎన్నెన్నో  

బలయ్యేది మహిళలు


4.12.25

చూపుల మిణుగురులు

 మన చూపులే

మనకి‌ మిణుగురు

అవే మనకి వెలుగునిస్తాయి

ప్రపంచాన్ని చూపిస్తాయి


కొందరి చూడ్కులు 

మిణుగురులు 

అవి ఆకర్షవంతమై

మనం ఆ ఆకర్షణకి

లోనవుతాం


యుక్తవయసులో

ఆకర్షించే

చూపుల మిణుగురులెన్నెన్నో

నిశి రాతిరి సైతం 

తలపులలో

స్వప్నంలో

ఆ చూపుల మిణుగురుల

ఆకర్షణ వెన్నంటే

వారి మనసు


ప్రపంచంలో

ఎన్ని చూపుల  మిణుగురులు 

ఎన్నెన్ని అందాలు

3.12.25

Monday, 1 December 2025

గుండె అద్దం

 

నా గుండె అద్దం
నిన్నే చూపుతుంది

నాగుండె అద్దం
విశ్వ ప్రేమని చాటుతుంది

నాగుండె అద్దంలో
ప్రకృతి  సౌందర్యం
ప్రతిఫలిస్తుంది

నా గుండె అద్దంలో
స్నేహ సౌందర్యం
అనుబంధాల
చిక్కదనం
స్పష్టమౌతాయి

నా గుండె అద్దంలో
తోటి మానవుల
పట్ల  శ్రేయస్సు
ఆర్తిగా ఆవిష్కరింపబడుతుంది


అగ్ని తరంగం

 ఆమె హృదయం 

అగ్ని  తరంగం


ప్రేమించి వివాహమాడిన

వ్యక్తయినా అధికారం

చలాయిస్తాడు


ప్రేమ వివాహం

కాబట్టి 

మెట్టింటిలోనూ

పుట్టింటిలోనూ

చిన్న చూపే


ఆఫీసులో

మగ అధికారులు

మగ సహోద్యోగులు

చూసే చూపులు 

చీదరగా ఉంటాయి

వెకిలి మాటలు

వెకిలి చేష్టలు 

మనసుని ప్రశాంతంగా

ఉండనీయవు

అందుకే 

ఆమె హృదయం 

నిత్యం అగ్ని తరంగం


1.12.25